Revanth Reddy: రోడ్డుపై బైఠాయించి సీఎం రేవంత్ నిరసన..! 4 d ago
మణిపూర్ అల్లర్లు, గౌతమ్ ఆదానీపై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణల అంశంలో కేంద్ర వైఖరికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఛలో రాజ్‌భవన్ చేపట్టారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ నుంచి రాజ్‌భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజ్‌భవన్ సమీపంలో రోడ్డుపై బైఠాయించి సీఎం రేవంత్, మంత్రులు నిరసన తెలిపారు. అనంతరం గవర్నర్ కు వినతిపత్రం ఇవ్వనున్నారు.